Wednesday, March 15, 2023

Highlights of Today's AP Cabinet Meeting

నేటి ఏ పి కేబినెట్ మీటింగ్ ముఖ్యాంశాలు

అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా జరిగిన ఏపీ కేబినెట్‌ భేటీలో పలు అంశాలకు ఆమోద ముద్ర పడింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ భేటీలో 45 అంశాలపై చర్చించగా, 15 అంశాలకు ఆమోదం లభించింది. దీనిలో భాగంగా కేబినెట్‌ భేటీ అనంతరం మంత్రి వేణు గోపాలకృష్ణ  మీడియాతో మాట్లాడారు.  

విశాఖలో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ విజయవంతం కావడంపై ముఖ్యమంత్రి జగన్‌ను మంత్రులు అభినందించారని వేణు గోపాలకృష్ణ తెలిపారు. ఆస్కార్‌ అవార్డు సాధించిన నాటు నాటు పాట బృందానికి ముఖ్యమంత్రి కేబినెట్‌లో అభినందనలు తెలిపారన్నారు.. ఏప్రిల్‌ 1వ తేదీన ఆర్బీఐ సెలవు, రెండో తేదీన ఆదివారం కావడంతో ఏపీ వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ 3వ తేదీన ఉంటుందన్నారు.

నేటి ఏ పి కేబినెట్ మీటింగ్ ముఖ్యాంశాలు

  • 1. ఏప్రిల్ నెలలో పింఛన్లు 3వ తేదీన పంపిణీ చేయాలని నిర్ణయం. ఏప్రిల్ 1న రిజర్వు బ్యాంకు సెలవు, 2న ఆదివారం కావడంతో 3న పింఛన్లు పంపిణీ చేయుటకు నిర్ణయం.
  • 2. పట్టాదారు పాస్ బుక్స్ ఆర్డినెన్స్-2023 సవరణకు కేబినెట్ ఆమోదం.
  • 3. షెడ్యూల్ కులాల చట్ట సవరణ బిల్లుకు కేబినెట్ లభించిందన్నారు. బీసీ కమిషన్, ఎస్టీ, మైనార్టీ, మహిళా కమిషన్ ఛైర్మన్ల పదవీ కాలాన్ని రెండేళ్లకు కుదిస్తూ చేసిన చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం.  
  • 4. ఏపీ మీడియా అక్రిడేషన్ నిబంధనల సవరణకు కేబినెట్ ఆమోదం.  
  • 5. ఏపీ పబ్లిక్ లైబ్రరీ చట్ట సవరణ, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ ఏపీ ఎడ్యుకేషన్ ఆర్డినెన్స్ ప్రతిపాదనను కేబినెట్ ఆమోదం.  
  • 6. పాఠశాలల్లో (High Schools) 5,388 మంది నైట్ వాచ్ మెన్ ల నియామకానికి కేబినెట్ ఆమోదం. నెలకు ఆరు వేల రూపాయల గౌరవ వేతనం. టాయిలెట్ నిర్వహణా నిధి నుంచి చెల్లించే విధంగా నిర్ణయం.
  • 7. ఏపీ పబ్లిక్ సర్వీసెస్ గ్యారెంటీ బిల్లు కు, 2023-27 నూతన పారిశ్రామిక విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.
  • గ్రామాలు విలీనం కి ఆమోదం.  
  • 9. ఏపీ లెజిస్లేచర్ సెక్రటరీ జనరల్ పోస్టు భర్తీకి ఆమోదం.  
  • 10. ఏపీ అడ్వొకేట్ వెల్ఫేర్ ఫండ్ చట్ట సవరణలకు ఆమోదం.
  • 11. ఏపీ రిజిస్ట్రేషన్ చట్టం-1908 సవరణకు, ఏపీ ఎక్సైజ్ చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం.
  • 12. దేవాలయాల్లో నాయి బ్రాహ్మణులను పాలకమండలిలో సభ్యులు గా నియమించే ప్రతిపాదనకు ఆమోదం.  
  • 13. జిల్లా గ్రంథాలయాల సిబ్బంది పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్ళకు పెంపు కి ఆమోదం.  
  • 14. ఎయిడెడ్ ప్రైవేటు విద్యాసంస్థల్లో టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్ళకు పెంచుతూ నిర్ణయం.
  • 15. ఏపీఐఐసీ చేసిన 50 ఎకరాల లోపు కేటాయింపులను ర్యాటిఫై చేసిన క్యాబినెట్ ఆమోదం.  
  • 16. ఏపీ గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం బిల్లు - 2023 కు ఆమోదం.
  • 17. ఎక్సైజ్ చట్టం సవరణకు ఆమోదం.
  • 18. దేవాలయాల్లో క్షుర ఖర్మలు చేస్తున్న నాయీ బ్రాహ్మణులకు కనీసం నెలకు 20 వేలు కమిషన్ అందించాలన్న ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం. కనీసం వంద పనిదినాలు ఉన్న క్షురకులకు ఇది వర్తింపు.

No comments:

Post a Comment

Ministry of Railway Recruitment 2023

 Ministry of Railway Recruitment 2023: Job in Railways without exam.. per month Rs. Salary up to 1,42,400.. Full details . రైల్వ...