Monday, August 30, 2021

Major changes have been made in the secretariat system.

 సచివాలయ వ్యవస్థలో పెను మార్పులు.ఇకపై ఉద్యోగులంతా సమయానికి విధులకు హాజరు కావాల్సిందే అంటూ ఆదేశాలు జారీ .

Major changes have been made in the secretariat system.

అమరావతి : రేపటి నుండి సచివాలయ వ్యవస్థలో పెను మార్పులు చోటు చేసుకొనున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకువచ్చిన గ్రామ సచివాలయ వ్యవస్థలో రేపటి నుంచి కీలక మార్పులు చోటు చేసుకొనున్నాయి. దాదాపు రెండేళ్ల పాటు ఉద్యోగుల పనితీరును, సచివాలయ వ్యవస్థతో పాటు వాలంటీర్ వ్యవస్థ పనితీరును క్షుణ్ణంగా పరిశీలించిన ప్రభుత్వం…ఇకపై ఉద్యోగులంతా సమయానికి విధులకు హాజరు కావాల్సిందే అంటూ ఆదేశాలు జారీ చేసింది.

ఇప్పటి వరకు ఉన్న రిజస్టర్ సంతకం విధానానికి స్వస్తి చెప్పిన సర్కార్.. రేపటి నుంచి అన్ని సచివాలయాల్లో బయో మెట్రిక్ విధానాన్ని అమలులోకి తేనుంది. ప్రతి ఉద్యోగి ఆఫీసుకు వచ్చి, వెళ్లే సమయాల్లో తప్పని సరిగా బయోమెట్రిక్ లో నమోదు చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.

అలాగే ఇకపై ప్రతి ఉద్యోగి కూడా సచివాలయం పరిధిలోనే నివసించాలని పంచాయతీ రాజ్ శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

కొత్త నిబంధనల ప్రకారం.. వారు ఎక్కడ ఉండేది… పంచాయతీ అధికారికి తెలియజేయాలి. అలాగే.. సచివాలయ ఉద్యోగి పూర్తి చిరునామా, వివరాలను అయా కార్యాలయాల్లో అందరికీ అందుబాటులో ఉంచాలి. ప్రజల అర్జీలను సకాలంలో పరిష్కరించాలని ఆ శాఖ ఉన్నతాధికారులు సూచనలు చేసింది. ఇప్పటికే అన్ని జిల్లాలకు ఆయా జిల్లాల వారీగా ఆదేశాలు జారీ చేసింది పంచాయతీ రాజ్ శాఖ. విధి నిర్వహణలో ఏ మాత్రం అలక్ష్యంగా ఉన్నా… సకాలంలో ప్రజా సమస్యలు పరిష్కరించకున్నా కూడా సంబంధిత ఉద్యోగిపై శాఖాపరమైన చర్యలు తీసుకోనుంది ప్రభుత్వం.

ఎక్కడైనా సాంకేతిక లోపం వస్తే… వెంటనే సంబంధిత అధికారికి చెప్పాలని అదేశించింది సర్కార్. జులై నెల జీతం బయోమెట్రిక్ తో లింక్ అయి వస్తుందని.. ఎన్నిరోజులు హాజరు ఉంటే అన్ని రోజులకే జీతం వస్తుందని స్పష్టం చేసింది. సచివాలయ ఉద్యోగులకు ఈ నెల 22 నుంచి ఎల్ఎంఎస్ ద్వారా ట్రైనింగ్ కార్యక్రమం నిర్వహించనుంది ప్రభుత్వం.

No comments:

Post a Comment

Ministry of Railway Recruitment 2023

 Ministry of Railway Recruitment 2023: Job in Railways without exam.. per month Rs. Salary up to 1,42,400.. Full details . రైల్వ...