Friday, March 17, 2023

Are the students preparing for the exams? If you read like this you will get good marks.

విద్యార్థులూ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నారా..? ఇలా చదవితే మంచి మార్కులు వస్తాయి.





చాలామంది విద్యార్థులకు పరీక్షలు అంటే భయం. పరీక్ష మొదలయ్యే వరకు కూడా పుస్తకం పట్టుకుని కూర్చుంటారు. కానీ నిజానికి విద్యార్థులు ఇలా చదివితే అసలు తిరిగే ఉండదు మంచిగా మార్కులు వస్తాయి ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వచ్చు.

మరి ఇక విద్యార్థులు పరీక్షల్లో మంచి స్కోర్ చేయాలంటే ఎలాంటి టిప్స్ ని ఫాలో అవ్వాలి అనే విషయాన్ని చూసేద్దాం.

ఇలా ఒత్తిడిని తగ్గించుకోండి

పరీక్షల సమయంలో ఎంత వేగంగా మీరు లేచి చదివితే అంత ఈజీగా మీకు ఉంటుంది పైగా వేగంగా మొదలుపెడతారు కాబట్టి త్వరగా పూర్తయిపోతుంది అంతేకానీ ఆలస్యం చేస్తే పరీక్ష దగ్గరకు వచ్చి ఒత్తిడి పెరిగిపోతుంది.

ఈ మూడు ముఖ్యం

పరీక్షలు రాసే విద్యార్థులు ఈ మూడిటిని గుర్తు పెట్టుకోండి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటూ ఉండండి. హైడ్రేట్ గా ఉండండి. అలానే కనీసం ఎనిమిది గంటల పాటు నిద్రపోండి. ఈ మూడు కూడా విద్యార్థులు గుర్తుపెట్టుకోవాలి. మామూలు రోజుల్లో ఎలా అయితే తింటారో అలానే ఆహారాన్ని తీసుకోండి స్కిప్ చేయకండి ఒకవేళ కనుక తిండి తినకపోతే ఆరోగ్యం పాడవుతుంది దాంతో పరీక్ష సరిగ్గా రాయలేరు.

గ్యాప్ తీసుకుని చదవండి

అదేపనిగా కూర్చుని చదివితే చదివేది సరిగ్గా ఎక్కదు. ఇబ్బందిగా చిరాకుగా ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో బ్రేక్ తీసుకోండి ఇది మీకు జ్ఞాపకశక్తిని పెంచుతుంది. చదివింది కూడా బాగా గుర్తుంటుంది.

మోడల్ పేపర్స్ ని చూడండి

మోడల్ పేపర్స్ లో ఉండే ప్రశ్నలు చూసి వాటికి జవాబులు చేయండి ఇది కూడా మీరు ఎంత బాగా చదివారు అనేది తెలుసుకోవడానికి సహాయపడుతుంది. అలానే పరీక్ష పేపర్ మీద కాస్త అవగాహన వస్తుంది.

రివిజన్ చేయండి

ఒకసారి చదివిన తర్వాత మళ్లీ రివిజన్ చేయండి మీకు బాగా గుర్తుంటుంది అలానే ఏ పాయింట్ మర్చిపోతున్నారో దాన్ని మీరు మళ్ళీ దానిని చదువుకోడానికి అవుతుంది.

టైం టేబుల్ ఫిక్స్ చేసుకోండి

టైం టేబుల్ ని ప్రిపేర్ చేసుకొని చదివితే బాగుంటుంది. టైం టేబుల్ లేకుండా చదవడం వృధా.

ప్రశాంతంగా ఉండండి

టెన్షన్ పడకుండా ప్రశాంతంగా కూర్చుని చదువుకుంటూ ఉండండి ఎగ్జామ్ అని భయపడుతూ ఉంటే చదివింది కూడా మర్చిపోతారు.

No comments:

Post a Comment

Ministry of Railway Recruitment 2023

 Ministry of Railway Recruitment 2023: Job in Railways without exam.. per month Rs. Salary up to 1,42,400.. Full details . రైల్వ...