Tuesday, November 9, 2021

BIEAP - Reduction of 30% syllabus for the academic year 2021-22 in view of reduction working days due to covid-19 -Regarding.

 BIEAP - Reduction of 30% syllabus for the academic year 2021-22 in view of reduction working days due to covid-19 -Regarding. 

          B


ఇంటర్మీడియట్‌ సిలబస్‌ 30% తగ్గింపు


 ఇంటర్మీడియట్‌ సిలబస్‌ 30% తగ్గింపు

 ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం సిలబస్‌ను 30శాతం తగ్గిస్తూ ఇంటర్‌ విద్యామండలి కార్యదర్శి శేషగిరిబాబు ఆదేశాలు జారీ చేశారు. కరోనా కారణంగా జూనియర్‌ కళాశాలల పనిదినాలు తగ్గినందున సిలబస్‌ను తగ్గిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరంలో నిర్వహించే పరీక్షల్లో 70శాతం సిలబస్‌ నుంచే ప్రశ్నలు వస్తాయని, తొలగించిన 30శాతాన్ని సాయంత్రం 4గంటల నుంచి 5గంటల వరకు, ఖాళీ పీరియడ్స్‌లో బోధించాలని సూచించారు. గతేడాది 2020-21లోనూ 30శాతం సిలబస్‌ను తగ్గించారు. సబ్జెక్టుల వారీగా తొలగించిన పాఠాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

పాఠశాల విద్యలోనూ తగ్గింపు.

పాఠశాల విద్యలో ఇప్పటికే సబ్జెక్టుల వారీగా రెండేసి అధ్యాయాలు(ఛాప్టర్స్‌) తగ్గించారు. ఈ మేరకు అకడమిక్‌ కేలండర్‌ను విడుదల చేశారు. సబ్జెక్టుల వారీగా తగ్గించిన సిలబస్‌ వివరాలను ఉపాధ్యాయులకు అందించారు.

Board of Intermediate Education, A.P., Vijayawada Modified Weightage of Marks (Blue-print) According to academy text book


Download Table

Inter Syllabus Reduced Order Copy


Friday, November 5, 2021

కోవిడ్-19 తో చనిపోయిన వారి కుటుంబ సభ్యుల

 కోవిడ్-19 తో చనిపోయిన వారి కుటుంబ సభ్యుల నుండి అప్లికేషన్లు  స్ధానిక తహసీల్దార్ వారి కార్యాలయములలో తీసుకొనబడును.. దానికి సమర్పించాల్సిన సర్టిఫికెట్లు..


1 చనిపోయిన వ్యక్తి ఆదార్ కార్డు 


2 ఫోన్ నెంబర్.

 

3 కోవిడ్ పాజిటివ్ సర్టిఫికెట్

                   

4 మరణ దృవీకరణ సర్టిఫికెట్

 

5 కుటుంబ సభ్యుల సర్టిఫికెట్ 

               

6 దరఖాస్తు దారుని ఆధార్ / ఫోన్ నెంబర్ 


7 తెల్ల రేషన్ కార్డు


8 తెల్లకాగితముపై అర్జీ.. 

 తహసీల్దార్ కు సమర్పించాలి.


బాధిత కుటుంబ సభ్యుల దరఖాస్తులు 29-10-2021 నుండి         8 -11-2021 తీసుకొన బడును......


కావున మనం అందరూ బాధ్యతగా తీసుకుని మన గ్రామ పరిధిలో అందరికి తెలియజేసి 8-11-2021లోపు అప్లికేషన్స్ తహసీల్దార్ గారికి చేర్చవలసినదిగా తెలియ జేయడమైనది.


Note :-కోవిడ్‌తో మరణించిన మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వ సాయంగా రూ.50 వేలు అందజేయడానికి  వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు.

Biometric Attendance to Students:

Biometric attendance for students from       November 8.                       

 


User guide on how to make a biometric attendance of children.


నవంబర్ 8 నాటికి పిల్లలకూ బయోమెట్రిక్ అఫ్లికేషన్ సిధ్ధం.


ఈ రోజు స్కూల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ మరియు  అడ్వైజర్ ( ఇన్ఫ్రా- స్కూల్ ఎడ్యుకేషన్) గారు DEO, APC,  EE లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ వివరాలు


1. ) వచ్చే జనవరిలో విద్యార్థులకు ఇవ్వవలసిన "జగనన్న అమ్మ ఒడి " కార్యక్రమం జూన్ 2022 కి మార్చబడినది.2. ) జగన్న అమ్మ ఒడి సహాయం పొందాలంటే విద్యార్థులు ఖచ్చితంగా 75% హాజరు కలిగి ఉండాలి. ( ఇది JAV GO లో మొదటి నుండీ ఉంది...కానీ కరోన లాక్ డౌన్  వలన 2020 & 2021 సంవత్సరాలలో మినహాయింపు ఇచ్చారు.3. ) 75% హాజరు కోసం నవంబర్ 8, 2021 వ తేదీ నుండి ఏప్రిల్ 30 , 2022 తేదీ వరకు ఉన్న 130 రోజులలో 75% అంటే 98 రోజులు ఖచ్చితంగా హాజరైన విద్యార్థులకు మాత్రమే 2022 జూన్ లో జగనన్న అమ్మ ఒడి లబ్ది చేకూర్చబడును.4. ) విద్యార్థుల హాజరును గణించడానికి నవంబరు 8 , 2021వ తేదీ లోపల బయొమెట్రిక్ అప్లికేషన్ సిద్ధం చేయబడుతుంది.5.) మన బడి నాడు నేడు   కు సంబందించి...మొదటి దశ పాఠశాలలో ప్రాజెక్టు పూర్తి అయిన తరువాత కూడా ఇంకా మిగులు ఉన్న పాఠశాలల నుండి NABARD కాంట్రాక్టర్లకు (డైరెక్ట్ అకౌంట్ బదిలీ) పెండింగ్ లో ఉన్న బిల్లులు చెల్లించాలి.దీనికి సంబంధించి STMS Software లో తగు చర్యలు కొన్ని రోజులలో సిద్ధం చేస్తారు.నవంబరు 8 నుంచి విద్యార్థులకు బయోమెట్రిక్‌ హాజరు..పిల్లల  బయోమెట్రిక్ హాజరు ఎలా వేయాలో యూజర్ గైడ్.



Download Copy



Ministry of Railway Recruitment 2023

 Ministry of Railway Recruitment 2023: Job in Railways without exam.. per month Rs. Salary up to 1,42,400.. Full details . రైల్వ...