Thursday, April 14, 2022

About Babasaheb Dr Bhimrao Ramji Ambedkar అంబేద్కర్ గురించి

 About Babasaheb Dr Bhimrao Ramji Ambedkar అంబేద్కర్ గురించి


భారత రాజ్యాంగ రూపశిల్పి, భారత రాజ్యాంగంలో కీలకపాత్ర వహించిన అంబేద్కర్ జీవిత చరిత్ర ఏంటో తెలుసుకోవాలంటే ఒకసారి ఈ స్టొరీ చదవాల్సిందే
బౌద్ధ ధర్మ పునరుద్ధరణకర్త. బాల్యంలోనే అడుగడుగునా బాధలకు, అవమానాలకు గురియై, బీదరికాన్ని ఎదుర్కొంటూ స్వయంకృషితో, స్వీయప్రతిభతో స్వతంత్ర భారతదేశంలో కేంద్రమంత్రి పదవిని అలంకరించిన మహామనీషి శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్.

About Babasaheb Dr Bhimrao Ramji Ambedkar అంబేద్కర్ గురించి


బాల్యము, యువకునిగా అంబేద్కర్

అంబేడ్కర్ 1891 సంవత్సరం ఏప్రిల్ 14 నాడు అప్పటి సెంట్రల్ ప్రావిన్సెస్ లో సైనిక స్థావరమైన మహోం అను ఊరిలో (ఇప్పటి మధ్యప్రదేశ్ లో) రాంజీ మలోజీ సాక్పాల్ మరియు భీమాబాయ్ దంపతుల 14 వ మరియు చివరి సంతానంగా జన్మించాడు. అతని కుటుంబం ఆధునిక మహారాష్ట్ర లోని రత్నగిరి జిల్లాలో అంబావడే పట్టణం (మందనగడ్ తాలూకాలో) వారు కావున మరాఠీ నేపథ్యం కలవారు. వీరు మహార్ కులానికి చెందినవారు. బ్రిటీష్ ఈస్ట్ భారతదేశం కంపెనీ యొక్క సైన్యంలో అంబేద్కర్ పూర్వికులు పనిచేశారు. వీరి తండ్రి భారత సేవలు మోహో సైనిక స్థావరంలో బ్రిటీష్ సైన్యంలో పనిచేశాడు. భీమ్‌రావ్ ను తండ్రి చాలా క్రమశిక్షణతో పెంచాడు. బాల భీమ్‌రావ్ ప్రతిదినం రామాయణ, భారత, తుకారం, మోరోపంత్ ల భజన గీతాలు గానం చేసేవారు. ఆ కుటుంబం శాకాహారం మాత్రమే సేవించేది.
బాల్యములో అంబేద్కర్ ఎదుర్కొన్న అంటరానితన సమస్య:
మెహర్లను అస్పృశ్యులుగా పరిగణించిన కాలమది. వేసవిసెలవుల్లో మామగారున్న గోరెగావ్ కు భీమ్‌రావ్, అన్న, మేనల్లుళ్ళతో పాటు వెళ్ళాడు. అనుకున్నట్లు, మామ స్టేషన్‍కు రాలేకపోయారు. స్టేషన్ నుండి, గ్రామానికి వెళ్ళటానికి బండిని కుదుర్చుకున్నాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత బండివాడికి, వీళ్ళు మెహర్ కులస్థులని తెలిసింది. అందరినీ బండి నుండి దిగమన్నాడు. ఎండాకాలం. పిల్లలు ఆ బండివాణ్ణి బతిమాలు కొన్నారు. రెండింతలు బాడుగ ఇస్తామన్నారు. భీమ్‌రావ్ అన్న బండి తోలేటట్లు, బండివాడు నడచి వచ్చేటట్లు మాట్లాడుకున్నారు. ఆకలి దప్పులతో అలమటిస్తూ అర్ధరాత్రికి గోరేగావ్ చేరారు పిల్లలు. వీధికుళాయి నీరు తాగుతూ వున్న భీమ్‌రావ్ ను కొట్టి మంచినీరు త్రాగకుండా గెంటివేశారు. కులంపేర భీమ్‌రావ్ ను అవమానాలకు గురిచేశారు. రామ్‍జీ, సతారా వదలి పిల్లల చదువుకోసం బొంబాయి చేరాడు. భీమ్‌రావ్ ఎల్‌ఫిన్‌స్టన్ హైస్కూల్ లో చేరి మెట్రిక్యులేషన్ పాసయ్యాడు. సంస్కృతం చదువు కోవాలని ఆశించాడు. కులం అడ్డు వచ్చింది. ఇష్టంలేకున్నా పర్షియన్ భాష చదివాడు. 16వ ఏటనే పెద్దలు అతనికి పెళ్ళి చేశారు.
బరోడా మహారాజు శాయాజీరావ్ గైక్వాడ్ ఇచ్చిన 25 రూపాయల విద్యార్థి వేతనంతో 1912లో బి.ఏ. పరీక్షల్లో నెగ్గాడు. పట్టభద్రుడైన వెంటనే బరోడా సంస్థానంలో ఉద్యోగం లభించింది. కాని పై చదువులు చదవాలన్న పట్టుదలవల్ల ఉద్యోగంలో చేరలేదు. మహారాజుకు తన కోరికను తెలిపాడు. విదేశంలో చదువుపూర్తిచేసిన తరువాత బరోడా సంస్థానంలో పదేళ్లు పనిచేసే షరతుపై 1913లో రాజాగారి ఆర్థిక సహాయం అందుకొని కొలంబియా విశ్వవిద్యాలయం చేరాడు. 1915లో ఎం.ఏ. 1916లో పి.హెచ్.డి. డిగ్రీలను సంపాదించాడు. ఆనాటి సిద్ధాంత వ్యాసమే పదేళ్ల తర్వాత "ది ఎవల్యూషన్ ఆఫ్ ప్రొవిన్షియల్ ఫైనాన్సస్ ఇన్ ఇండియా" అను పేరుతో ప్రచురించబడింది. 1917 లో డాక్టర్ అంబేద్కర్‍గా స్వదేశం వచ్చాడు. అప్పటికాతని వయస్సు 27 ఏళ్లు. అస్పృశ్యుడొకడు అంతగొప్ప పేరు సంపాదించుకోవటం ఆనాటి అగ్రవర్ణాలవారికి ఆశ్చర్యం కల్గించింది


మహారాజాగారి మిలిటరీ కార్యదర్శి అయ్యాడు. కాని ఆఫీసులో నౌకర్లు కాగితాలు ఆయన బల్లపై ఎత్తివేసేవారు! కొల్హాపూర్ మహారాజు సాహూ మహరాజ్ అస్పృశ్యతా నివారణకెంతో కృషి చేస్తుండేవాడు. మహారాజా సహాయంతో అంబేద్కర్ 'మూక నాయక్' అనే పక్షపత్రిక సంపాదకత్వం వహించాడు. 32 సంవత్సరాల వయసులో డా.అంబేద్కర్, బార్-అట్-లా, కొలంబియా విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి. లండన్ విశ్వవిద్యాలయం నుండి డి.ఎస్.సి పట్టాలను పొందాడు. కాని ఆఫీసు జవానులు కూడా ఈయనను అస్పృశ్యుడుగా చూచారు.

దళిత మహాసభ (1927)- మనుస్మృతి దహనము:
1919 మాంటేగ్ చేమ్స్ ఫర్డ్ సంస్కరణలు భారతదేశములో ఎలా పనిచేస్తున్నాయో అధ్యయనం చేయడానికి, నూతన రాజ్యంగ సంస్కరణల కోసం సూచించేందుకు ఏర్పాటు చేయబడ్డ సైమన్ కమీషన్ భారతదేశాన్ని 1928 లో పర్యటించింది. ఆ పర్యటన అనంతరం ఆ కమిటీ బ్రిటిష్ ప్రభుత్వానికి అందించిన నివేదికను చర్చించడానికి బ్రిటిష్ ప్రభుత్వము మూడు రౌండ్ టేబుల్ సమావేశాలను ఏర్పరచింది. ఈ సమావేశాలు 1930, 1931, మరియు 1932 లలో జరిగాయి. ఈ మూడు సమావేశాలకు అంబేద్కర్ హాజరు అవ్వగా రెండవ సమావేశములో భారత జాతీయ కాంగ్రెస్ తరపున గాంధీ హాజరు అయ్యారు. ఈ సమావేశాములోనే గాంధీకు అంబేద్కర్ కు మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. అంబేద్కర్ దళితులకు ప్రత్యెక నియోజక వర్గాలు ఇవ్వాలని పట్టుబట్టగా, అలా ఇస్తే హిందూ సమాజం విచ్చిన్నమవుతుందని అందుకు గాంధీ ఒప్పుకోలేదు. ఏకాభిప్రాయము కుదరక పోవడముతో రెండవ రౌండ్ టేబుల్ సమావేశము నుండి గాంధీ బయటకు వచ్చేసెను. 1932 లో రామ్సే మెక్ డోనాల్డ్ "కమ్యూనల్ అవార్డు" ను ప్రకటించడం జరిగింది. దీని ప్రకారం దళితులకు ప్రత్యెక నియోజక వర్గాలు ప్రతిపాదించబడ్డాయి.
ఈ ప్రకటన వెలువడే నాటికి గాంధి శాసనోల్లంఘన ఉద్యమములో భాగముగా అరెస్ట్ అయి ఎరవాడ జైలులో ఉన్నారు. ఈ ప్రకటన గూర్చి తెలుసుకొని గాంధీ నిరాహారదీక్ష చేపట్టారు. అంబేద్కర్ పై నైతిక వత్తిడి పెరిగింది. చివరికి గాంధీ కి అంబేద్కర్ కు మధ్య పూనా ఒప్పందం కుదిరి కమ్యూనల్ అవార్డ్ కన్నా ఎక్కువ స్థానాలు ఉమ్మడి నియోజక వర్గాలలో ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. దీని తర్వాత గాంధి 'హరిజన్ సేవక్ సమాజ్' ఏర్పరచి అస్పృస్యత నివారణకు కృషి చేసాడు. అంబేద్కర్ ను కూడా ఇందులో భాగస్వామిని చేసాడు గాంధీ. కాని అంటరాని తన నిర్మూలనలో గాంధి కున్న చిత్తశుద్ది మిగిలిన కాంగ్రెస్ నాయకులకు లేదు. దీనితో అంబేద్కర్ గాంధి ఉద్యమమునుండి బయటకు వచ్చి ప్రత్యేఖముగా దళిత సమస్య పరిష్కారానికి ఆలిండియా డిప్రేస్సేడ్ క్లాస్ కాంగ్రెస్, ఆలిండియా షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ వంటి అనేక రాజకీయ పార్టీలను ఏర్పాటు చేసి దేశవ్యాప్తముగా దళితులను సమీకరించే ప్రయత్నమూ చేసారు. ఈ సందర్భములో క్విట్ ఇండియా ఉద్యమం, ఆ తరువాత దేశ విభజనతో కూడిన స్వాతంత్రము రావడం జరిగాయి.
రాజ్యంగ పరిషత్తు సభ్యుడిగా- మంత్రివర్గ సభ్యుడిగా అంబేద్కర్:
రాజ్యాంగ పరిషత్తు సభ్యుడుగ అంబేద్కర్ విశేష శ్రమవహించి రాజ్యాంగం రచించటం ఆయన శేష జీవితంలో ప్రముఖమైన ఘట్టం. టి.టి కృష్ణమాచారి (కేంద్రమంత్రి) ఒకమారు రాజ్యాంగ పరిషత్తులో మాట్లాడుతూ 'రాజ్యాంగ రచనా సంఘంలో నియమింపబడిన ఏడుగురిలో ఒకరు రాజీనామా చేశారు. మరొకరు మరణించారు. వేరొకరు అమెరికాలో వుండి పోయారు. ఇంకొకరు రాష్ట్ర రాజకీయాలలో నిమగ్నులయ్యారు. ఉన్న ఒక్కరిద్దరు ఢిల్లీకి దూరంగా ఉన్నారు. అందువల్ల భారత రాజ్యాంగ రచనా భారమంతా డా.అంబేద్కర్ మోయవలసి వచ్చింది. రాజ్యాంగ రచన అత్యంత ప్రామాణికంగా వుంటుందనటంలో ఏలాంటి సందేహం లేదు, అన్నాడు. కేంద్ర మంత్రి మండలిలో న్యాయశాఖ మంత్రిగా వుండి 1951 అక్టోబర్ లో మంత్రి పదవికి రాజీనామా చేశాడు
బౌద్దమును స్వీకరించుట:
అంబేద్కర్ తన 56 ఏట సారస్వత బ్రాహ్మణ కుటుంబానికి చెందిన కుమారి శారదా కబీర్ ను పెళ్ళి చేసుకున్నాడు. మొదటి భార్య 1935లో మరణించింది. . 1956 అక్టోబర్ 14న నాగ్ పూర్ లో అంబేద్కర్ బౌద్ధమతాన్ని స్వీకరించాడు. గాంధీజీతో అనేక విషయాలలో భేదించినా తాను మతం మారదలచుకున్నప్పుడు మాత్రం దేశానికి చాలా తక్కువ ప్రమాదకరం అయినదానినే ఎన్నుకుంటానని, బౌద్ధం భారతీయ సంస్కృతిలో భాగమని, ఈ దేశ చరిత్ర సంస్కృతులు, తన మార్పిడివల్ల దెబ్బతినకుండా చూచానన్నాడు. హిందువుగా పుట్టిన అంబేద్కర్ హిందువుగా మరణించలేదు. నిరంతర కృషితో సాగిన ఆయన జీవితం ఉద్యమాలకు వూపిరిపోసింది. ముఖ్యంగా సాంఘిక సంస్కరణలకు. అంబేద్కర్ పెక్కు గ్రంథాలు వ్రాశాడు.
'ది ప్రాబ్లం ఆఫ్ ది రూపీ', 'ప్రొవిన్షియల్ డీ సెంట్రలైజేషన్ ఆఫ్ ఇంపీరియల్ ఫైనాన్స్ ఇన్ బ్రిటీష్ ఇండియా', 'ది బుద్దా అండ్ కార్ల్ మార్క్స్', 'ది బుద్ధా అండ్ హిజ్ ధర్మ' ప్రధానమైనవి. ప్రసిద్ధ రచయిత బెవెర్లి నికొలస్ డాక్టర్ అంబేద్కర్ భారతదేశపు ఆరుగురు మేధావులలో ఒకరు అని ప్రశంసించాడు. మహామేధావిగా, సంఘసంస్కర్తగా, న్యాయశాస్త్రవేత్తగా, కీర్తిగాంచిన డాక్టర్ భీమారావ్ అంబేద్కర్ 1956 డిసెంబర్ 6 న కన్ను మూశాడు. భారత రాజ్యాంగ శిల్పిగా, ప్రజాస్వామ్య పరిరక్షకునిగా, సంఘసంస్కర్తగా, మహామేధావిగా విఖ్యాతుడైన డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ స్మృతికి నివాళులర్పిస్తూ, ఆ మహనీయునికి ' భారతరత్న ' అవార్డును భారత ప్రభుత్వం యివ్వడం అత్యంత అభినందనీయం.

Monday, April 11, 2022

AP SSC 10th Class Pre-final April 2022 Biological Science Question paper & Key Papers

 AP SSC 10th Class Pre-final April 2022 Biological Science Question paper & Key Papers

AP SSC 10th Class Pre-final April 2022 Biological Science Question paper & Key Papers


AP SSC 10th Class Pre-final Telugu / Hindi / English / Maths Mathematics PS Physics Physical Sciences BS Biology Biological Sciences SS Social Studie.

AP SSC 10th Class Pre-final April 2022 Key Papers AP SSC 10th Class April 2022 Telugu / Hindi / English / Maths Mathematics PS Physics Physical Sciences BS Biology Biological Sciences SS Social Studies 


Download 10th Pre-final BIOLOGY EM Key Paper

Download 10th Pre-final BIOLOGY TM Key Paper

TELUGU QUESTION PAPER & KEY

HINDI QUESTION PAPER & KEY

ENGLISH QUESTION PAPER & KEY

Maths QUESTION PAPER & KEY

Download Physic ras Question Paper

Formative Assessment-3 (FA-III) Marks Entry Window enabled in studentinfo.ap.gov.in

  Formative Assessment-3 (FA-III) Marks Entry Window enabled in studentinfo.ap.gov.in.


ALL IN ONE 





FA-3 Marks Entry 2021-22: 


Option to register for FA 3 Marks in the 2021-22 academic year. Teachers can enter your school logins and your students' marks ....


Login with DISE Code,

Select CCE Marks

Select FA-3 Services..

Select Class and Enter the Marks


http://studentinfo.ap.gov.in

Sunday, April 10, 2022

Live swearing in of new ministers

 కొత్తమంత్రులు ప్రమాణ స్వీకారం లైవ్

Live swearing in of new ministers

VIEW THE VIDEO 


  1. గుడివాడ అమర్నాథ్‌
  2. దాడిశెట్టి రాజా
  3. బొత్స సత్యనారాయణ
  4. రాజన్నదొర
  5. ధర్మాన ప్రసాదరావు
  6. సీదిరి అప్పలరాజు
  7. జోగి రమేష్‌
  8. అంబటి రాంబాబు
  9. కొట్టు సత్యనారాయణ
  10. తానేటి వనిత 
  11. కారుమూరి నాగేశ్వరరావు
  12. మేరుగ నాగార్జున
  13. బూడి ముత్యాలనాయుడు
  14. విదుదల రజిని
  15. కాకాణి గోవర్ధన్‌రెడ్డి
  16. అంజాద్‌ భాష
  17. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
  18. బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి
  19. పినిపె విశ్వరూప్‌
  20. గుమ్మనూరు జయరాం
  21. ఆర్కే రోజా
  22. ఉషశ్రీ చరణ్‌
  23. తిప్పేస్వామి
  24. చెల్లుబోయిన వేణుగోపాల్‌
  25. నారాయణస్వామి

Eastern Railway Recruitment 2022

  Railway Recruitment 2022 : రైల్వేలో 2972 అప్రెంటీస్ పోస్టులు . పదో తరగతి అర్హత .. వెంటనే అప్లై చేసుకోగలరు.

 

Eastern Railway Recruitment 2022

Eastern Railway Recruitment 2022:10వ తరగతితో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడానికి మంచి అవకాశం వచ్చింది. ఈస్ట్రన్‌ రైల్వే అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

మొత్తం పోస్టులు : 2972

మొత్తం 2972 ​పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 11 నుంచి ప్రారంభమై మే 10, 2022 వరకు కొనసాగుతుంది. దరఖాస్తు చేయడానికి ముందు అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్న నోటిఫికేషన్‌ను ఒక్కసారి చదివితే మంచిది. చివరి తేదీ తర్వాత దరఖాస్తులు ఏవి అంగీకరించరని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి.

ఈ విభాగాల్లో ఖాళీలని భర్తీ చేస్తారు

  • 1. హౌరా డివిజన్ – 659 పోస్టులు
  • 2. లిలుహ్ డివిజన్ – 612 పోస్టులు
  • 3. సీల్దా డివిజన్ – 297 పోస్టులు
  • 4. కంచరపర డివిజన్ – 187 పోస్టులు
  • 5. మాల్డా డివిజన్ – 138 పోస్టులు
  • 6. అసన్సోల్ డివిజన్ – 412 పోస్టులు
  • 7. జమాల్‌పూర్ డివిజన్ – 667 పోస్టులు

ఎలా దరఖాస్తు చేయాలి?

  • 1. దరఖాస్తు చేయడానికి ముందుగా అధికారిక వెబ్‌సైట్– కి వెళ్లండి.
  • 2. వెబ్‌సైట్‌లో ఉన్న హోమ్ పేజీలో నోటిఫికేషన్‌కి వెళ్లండి.
  • 3. తర్వాత మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్‌కి వెళ్లండి.
  • 4. అభ్యర్థించిన వివరాలను నింపడం ద్వారా దరఖాస్తు చేసుకోండి.
  • 5. తర్వాత అప్లికేషన్ ప్రింట్ అవుట్ తీసుకోండి.

అర్హత & వయో పరిమితి
ఈస్టన్ రైల్వే జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. లేదా గుర్తింపు పొందిన బోర్డు నుంచి మొత్తంగా కనీసం 50 శాతం మార్కులతో సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. అదనంగా NCVT/SCVT జారీ చేసిన నిర్దేశిత ట్రేడ్‌లో జాతీయ TED సర్టిఫికేట్ కలిగి ఉండాలి. అదే సమయంలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి వయోపరిమితి 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు రుసుము
అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే జనరల్ అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.100 చెల్లించాలి. ఫీజు చెల్లించిన తర్వాతే దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది. అయితే, SC/ST/PWBD/మహిళా అభ్యర్థులు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

AP POLYCET-2022: Polytechnic Common Entrance Test

 AP POLYCET-2022: Polytechnic Common Entrance Test


AP POLYCET-2022: Polytechnic Common Entrance Test – Details Here

                       ఏపీ పాలిటెక్ని క్ కామన్ ప్రవేశపరీక్ష - పాలిసెట్ - 2022 – వివరాలు ఇవే

ఆం ధ్రప్రదేశ్-విజయవాడలోని స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్  ఎడ్యు కేసన్ అండ్ ట్రెయినింగ్                                 ఆం ధ్రప్రదేశ్(ఎస్‌బిటిఈటి-ఏపీ) 2022-23 విద్యాసంవత్సరానికి గాను పాలిసెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వా రా వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు .

పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స టెస్ట్ (పాలీసెట్)-2022

అర్హ త: పదో తరగతి/తత్సమాన ఉత్తీర్ణత. కంపార్ట్ మెంట్ విధానంలో ఉత్తీర్ణులైన,

2022లో ఏప్రిల్/మే నెలల్లో పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యా ర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు .

ఎం పిక విధానం : ఉమ్మ డి ప్రవేశ పరీక్ష ఆధారం గా ఎం పిక పరీక్ష నిర్వ హిస్తారు.

దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

పాలిసెట్-2022 పరీక్ష తేది: 29.05.2022.


Polytechnic Common Entrance Examination - Polyset - 2022 Announcement

 Polytechnic Common Entrance Examination - Polyset - 2022 Announcement.



Polytechnic Common Entrance Examination - Polyset - 2022 Announcement

ఏపీ పాలిటెక్నిక్ కామన్ ప్రవేశ పరీక్ష - పాలిసెట్ - 2022 – వివరాలు 

2022-23 విద్యా సంవత్సరమునకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని పాలిటెక్నిక్ లలో వివిధ డిప్లమో కోర్సులలో ప్రవేశం కోరుతున్న అభ్యర్థుల కొరకు రాష్ట్ర సాంకేతిక విద్యా మరియు శిక్షణామండలి, ఆంధ్రప్రదేశ్, విజయవాడ వారు "పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్టు - పాలిసెట్ - 2022 ను ఈ దిగువ తెలిపిన వివరముల ప్రకారము నిర్వహించబోవుచున్నారు.

అర్హత: ఎస్.ఎస్.సి. లేదా తత్సమాన పరీక్ష నందు ఉత్తీర్ణత మరియు ఎస్.ఎస్.సి. లేదా తత్సమాన పరీక్షకు ఏప్రియల్/మే 2022లో హాజరుకాబోతున్న విద్యార్థులు అర్హులు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రారంభ తేదీ: 11-04-2022

దరఖాస్తు ఆఖరి తేది:  18-05-2022

పరీక్ష తేది: 29-05-2022





Ministry of Railway Recruitment 2023

 Ministry of Railway Recruitment 2023: Job in Railways without exam.. per month Rs. Salary up to 1,42,400.. Full details . రైల్వ...